Monday, December 23, 2024

బాల్యంలోనే ఎక్కువమంది వినికిడి కోల్పోతున్నారు…

- Advertisement -
- Advertisement -

Most people lose their hearing in childhood

 

హైదరాబాద్ : దేశంలో పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లలో ఇద్దరు, ముగ్గురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటోంది. శిశువులుగా ఉన్నప్పుడు, బాల్యంలో ఇంకా ఎక్కువమంది వినికిడి కోల్పోతారు. జీవితంలో మొదటి మూడేళ్లలో మాట్లాడటం బాష అభివృద్ది చెందడం లాంటివి జరుగుతాయి. మాటలను అర్దం చేసుకోవడానికి అవసరమైన నాడీ మార్గాలను ఈసమయంలోనే మెదడు నిర్మిస్తుందని కిమ్స్ ఆసుప్రతి ఈఎన్‌టి నిపుణుడు, డా. జగిని జనార్దనరావు పేర్కొంటున్నారు. వినికిడి దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినికిడి అనేది మెదడు పనితీరు, ధ్వనిని ఆమోదించి, దాని ప్రాసెస్ చేయడానికి పిల్లల మెదడు ముందస్తుగా వైర్ చేసి ఉంటుంది. వినికిడి సామర్దం సాధారణంగానే ఉన్న పిల్లలు 20 వారాల గర్భదారణ సమయంలో పుట్టుకకు ముందు నుంచే వినడం ప్రారంభిస్తారు. పుట్టినప్పుడు పిల్లలు తమ ముందుగా తన తల్లి స్వరాన్ని, వారి మాతృభాషను శబ్దం కంటే మనుషుల మాటలను, పుట్టుకకు ముందు విన్న పాటలు, కథలను వినడానికి ఇష్టపడుతారు.

శిశువుల్లో వినికిడి లోపం అనేది న్యూరో డెవలప్‌మెంట్ ఎమర్జెన్సీ వినికిడి శక్తికి మెదడే అసలైన కీలక అవయవం. చెవులు మెదడుకు మాత్రమే శబ్దాలను ప్రసారం చేస్తాయి. వినికిడి లోపంతో జన్మించిన శిశువులు,సాధారణ వినికిడి ఉన్న పిల్లలా తమ జీవితాన్ని ప్రారంభించలేరు. వారు పుట్టడానికి ముందు తమ శ్రవణ మార్గాల్లో 20 వారాల సాధారణ అభివృద్ది కోల్పోతారు. పుట్టిన తరువాత జరిగే ఆడిటరీ న్యూరల్ డెవలప్‌మెంట్ వారిలో ఉండదు. వారికి వినిపించడం లేదని మనం గుర్తించేలోపే ఈసమస్య తలెత్తుతుంది. పుట్టిన తరువాత జరిగే అడిటరీ బ్రెయిన్ పాత్‌వేస్ కూడా వారిలో అభివృద్ది చెందవు. మేల్కొన్న సమయమంతా కూడా వినికిడి పరికరాలు ధరిస్తేనే పిల్లలు నిరంతర శబ్దాలు వినగలరని తెలిపారు. పుట్టిన వెంటనే వినికిడి నష్టాన్ని కూడా మెరుగైన టెక్నాలజీతో మనం గుర్తించవచ్చని, వినికిడి సమస్య చికిత్సల ఆధారంగా వారికి వైద్యం చేయించోచ్చు. వారు వినికిడి ఉపకరణాలను ఉపయోగించాల్సిన రావచ్చు.

కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అవసరమైతుంది. మనం సమస్యను ముందుగా గుర్తించి మెదడును ఉత్తేజపరిచే చికిత్స ప్రారంభించాలి. క్లాకియర్ ఇంప్లాంట్ ఖర్చు ప్రతి చెవికి రూ.8లక్షల నుంచి రూ. 20లక్షల వరకు ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలున్న కుటుంబాలకే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్లను అందిస్తోందన్నారు. తాము 12 నెలల లోపు పిల్లలకు అనేక శస్త్రచికిత్సలు చేశామని, శిశువుల్లో వినికిడి లోపంపై తల్లిదండ్రుల్లో అవగాహన పెరుగుతోందన్నారు. పిల్లల వినికిడి సమస్యను తల్లిదండ్రులు మొదట్లోనే గుర్తించి, 6నుంచి 10 నెలల వయస్సులోపే పరీక్షలు, చికిత్సకు వారిని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలోల పిల్లలో వినికిడి సమస్యను గుర్తించడం సమస్యగా ఉందని చెప్పారు. పిల్లలకు 2నుంచి 3 ఏళ్ల వచ్చే వరకు తల్లిదండ్రులు ఈసమస్యను గుర్తించలేకపోతున్నారని వివరించారు. దీంతో చికిత్స కూడా ఆలస్యం అవుతోంది. ఫలితాలు బాగుండాలంటే పది నెలల లోపు వయస్సులోనే చికిత్స ప్రారంభించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News