Monday, November 25, 2024

మాంసాహారులతోనే హిమాచల్‌కు మూడింది

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు ఎక్కువగా మాంసాహారులే అవుతున్నందుననే వరదలు, కొండచరియలు విరిగిపడటం జరుగుతోందని ఐఐటి మండి డైరెక్టర్ లక్ష్మిధర్ బెహెరా వ్యాఖ్యానించారు. దీనిని చూసైనా విద్యార్థులు మాంసం ముట్టబోమని ప్రతిన తీసుకోవల్సి ఉందని పిలుపు నిచ్చారు. జంతువులు, మూగజీవాలపై క్రూరత్వం చూపితే ప్రకృతి కోపించదా అని ఆయన ప్రశ్నించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ఐఐటి విద్యార్థులను ఉద్ధేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఈ విషయాలు ప్రస్తావించిన వైనం ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ప్రచారంలోకి వచ్చింది.

తరచూ ఇక్కడనే ఎందుకు వరదలు వస్తున్నాయి. ఉన్నట్లుండి కొండలు విరిగి ఎందుకు కింద పడుతున్నాయి. ఇదంతా కూడా జరుగుతోన్న జంతువధతోనే అని తేల్చిచెప్పారు. దీనిని తాను కేవలం సెంటిమెంట్ కోణంలోనే చెప్పడం లేదని, మూగజీవాలు, పక్షులు జంతువులు అంతా కూడా ప్రకృతిలో మమేకం అయి ఉంటాయి. వీటిని నాశనం చేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ఇదే ఇప్పుడు జరిగిందని, ఈ క్రమంలో మాంసాహారం మానివేయడం మంచిదని విద్యార్థులకు ఆయన పిలుపు నిచ్చారు. మంచి మనుష్యులుగా మారాలంటే ముందు మీరు మాంసం మానాలని సూచించారు. ఈ మేరకు మాంసం ముట్టబోమని ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News