Wednesday, March 12, 2025

అత్యంత ప్రజాదరణ గల నటుల జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఎవరంటే..?

- Advertisement -
- Advertisement -

కింగ్ ఖాన్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఐఎమ్ డిబి విడుదల చేసిన అత్యంత ప్రజాదరణ గల నటుల జాబితాలో షారుఖ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది షారుఖ్ రెండు సూపర్ హిట్ సినిమాలు.. జవాన్, పఠాన్ లలో నటించి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. జాబితాలో అలియా భట్, దీపికా పడుకోనే రెండు,మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఐఎమ్ డిబి జాబితాలో తాను రెండో స్థానంలో ఉన్నందుకు అలియా భట్ హర్షం వ్యక్తం చేస్తూ, తనపై అభిమానులు చూపిస్తున్న ఆదరణకు హర్షం వ్యక్తం చేశారు. నాలుగో స్థానంలో వర్థమాన నటి వమికా గబ్బీ ఉన్నారు. ఇక నయనతార, తమన్నా, కరీనా కపూర్, శోభితా ధూళిపాళ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. తొమ్మిదో స్థానంలో హీరో అక్షయ్ కుమార్, తమిళ నటుడు విజయ్ సేతుపతి పదవ స్థానంలోనూ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News