Saturday, November 16, 2024

దేశంలోనే అత్యధిక క్రీడా ప్రాంగణాలు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : క్రీడలకు తెలంగాణ అత్యధిక ప్రాధాన్యమిస్తుందని దేశంలోనే అత్యధిక క్రీడా ప్రాంగణాలు ఉన్న రాష్ట్రం మనది అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. 16700 క్రీడా ప్రాంగణాలతో తెలంగాణ చరిత్ర సృష్టించిందని ఆయన తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్టేడియం గ్రౌండ్స్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రన్‌ను మంత్రి బెలూన్లు, పావురాలను ఎగురవేసి, జెండా ఊపి ప్రారంభించారు. రన్ స్టేడియం గ్రౌండ్స్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు కొనసాగింది. విద్యార్థులు యువత పుర ప్రజలు పెద్ద ఎత్తున ఈ రన్‌లో పాల్గొన్నారు.

అంతకు ముందు స్టేడియం గ్రౌండ్‌లో మంత్రి మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఒకప్పుడు క్రీడా వసతులు ఏ మాత్రం ఉండేవి కాదని ఇప్పుడు స్టేడియం ఆవరణలో అద్భుతమైన ఇండోర్ స్టేడియం, ఏపిఎస్ కళాశాలలో మరో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ప్రధాన స్టేడియ ంలో హాస్టల్ వసతి కల్పించి క్రీడాకారులకు అండగా నిలుస్తామన్నారు.

ఆట పాటలతో పాటు విద్యార్థులు చదువులోనూ చక్కగా రాణించాలని సూచించారు. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్నా రు. బాగా కష్టపడి చదువుకొని ఐఎఎస్ , ఐపీఎస్ అధికారులు అయి సొంత ఊరికి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఇం టర్ నుంచి ఓ ఐదేళ్ల పాటు కష్టపడితే చాలు జీవితంలో స్థిర పడాతారని అన్నారు. ఇప్పుడు కష్టపడి చదవకపోతే భవిష్యత్తులో ఏదో చిన్నా చితక పని చేసి బతకాల్సి వస్తుందన్నారు.

సెల్ ఫోన్‌ను టైం పాస్ కోసం కాకుండా జ్ఞానాన్ని పెంచుకునేందుకు, అనుమానాల నివృత్తి కోసం మాత్రమే వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని , హన్వాడ స్కూల్ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఒకప్పు డు పాడుబడిపోయిన హన్వాడ స్కూల్ చూపేందు కు ఢిల్లీ నుంచి ఓ బృందం వస్తున్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ రవి నాయక్, డిఐజి ఎల్‌ఎస్ చౌహన్, ఎస్పీ కె. నర్సింహ, అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేష్, మధు, సిఐలు రాజేశ్వర్‌గౌడ్, స్వా మి, ప్రవీణ్, జిల్లా , యువజన సంక్షేమ అధికారి శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా అధుడు గో పాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు శాం తన్న యాదవ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ , బిగ్‌బాస్ ఫేం విశ్వ, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News