Sunday, December 22, 2024

మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు

- Advertisement -
- Advertisement -

Most suicides in Maharashtra

2021 ఉదంతరాల జాబితా వెలుగులోకి

న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక సంఖ్యలో మహారాష్ట్రలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ తరువాతి స్థానంలో తమిళనాడు , మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. 2021 సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల సంఖ్య 1,64,033గా రికార్డు అయింది. జాతీయ నేర చిట్టాల వేదిక (ఎన్‌సిఆర్‌బి) బలవన్మరణాలకు సంబంధించి తాజా నివేదికను వెలువరించింది. వృత్తి ఉద్యోగపరమైన కారణాలు, అసంతృప్తి, ఒంటరితనపు అనుభూతి, దూషణలకు తట్టుకోలేకపోవడం, హింసాత్మక ఘటనలు , కుటుంబ సమస్యలు , మానసిక రుగ్మతలు , ఆల్మహాల్‌కు అలవాటుపడటం, ఆర్థిక నష్టాలు , దీర్ఘకాలిక శారీరక నొప్పి వంటి అంశాలు మనిషిని ఆత్మహత్యలకు పురికొల్పుతున్నాయి. జీవితం ఎందుకు? అనే వైర్యాగ స్థితిక చేరుకుని నిండుప్రాణాలు తీసుకుంటున్నారు. జీవితగమనంలో తట్టుకోలేని టెన్షన్లు,ఇతరులతో సరిపోల్చుకుని తమకు తాము ఆత్మనూన్యతకు గురిచేసుకోవడం వంటి పరిణామాలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ప్రత్యేకించి యువతరంలో ఇటువంటి పరిణామం తలెత్తడం ఆందోళనకరంగా మారింది.

అత్యంత సున్నితత్వాన్ని సంతరించుకుని ఉండే యువత జీవితంలో ఆటుపోట్లను అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. తాము ఇతరులతో పోలిస్తే ఎటువంటి ఉద్యోగ స్థితిని పొందాం? అన్యుల కన్నా ఎంత తక్కువగా సంపాదిస్తున్నామనే విషయాలు యువతను తీవ్రస్థాయి ఆందోళనకు దారితీయిస్తున్నాయి. అంతకు ముందటి ఏడాది అంటే 2020లో సంభవించిన ఆత్మహత్యలతో పోలిస్తే మరుసటి సంవత్సరం 2021లో జరిగిన ఆత్మహత్యల సంఖ్య 7.2 శాతం ఎక్కువగా ఉంది. ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలలో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఆ తరువాతి స్థానంలో కర్నాటక ఉన్నాయి. అత్యధిక జనాభా గల ఉత్తరప్రదేశ్‌లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు రికార్డు అయ్యాయి. దేశవ్యాప్త లెక్కలో చూస్తే ఇది ఇక్కడ 3.6 శాతంగా ఉంది. 2021లో 53 మెగాసిటీలలో మొత్తం 25,891 అర్థాంతర చావులు చోటుచేసుకున్నాయి.

లక్ష మందిలో 12 ఆత్మహత్యలు

అత్యంత విషాదకరం, అవాంచనీయం అయిన ఆత్మహత్యల ఘటనకు సంబంధించి సాధారణంగా గణాంకాలను లక్ష మందిలో ఎందరు స్వయం బలి అయ్యారనే ప్రాతిపదికన లెక్కకడుతారు.ఈ లెక్కన చూస్తే 2021లో దేశంలో లక్ష మందిలో ఆత్మహత్యలు సగటున 12గా రికార్డు అయ్యాయి. ఇక నగరాల వారిగా చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. 2020లో ఢిల్లీలో 3142 ఘటనలు జరిగాయి. తరువాత పుదుచ్చేరిలో 408 మంది చనిపోయ్యారు, 53 మహానగరాలలో మొత్తం ఆత్మహత్యల సంఖ్య అత్యధికంగానే ఉండటం కలవరానికి దారితీసింది. నగరీకరణ మిగిల్చిన టెన్షన్‌కు ఇది ప్రతీక అయిందని స్పందనలు వెలువడ్డాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News