Monday, December 16, 2024

మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Most wanted criminal Sunkara Prasad Naidu arrested

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరొందిన హైదరాబాద్‌కు చెందిన సుంకర ప్రసాద్ నాయుడును ఎపిలోని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో సుంకర ప్రసాద్ నాయుడితో పాటు మరో 15 మంది అతని అనుచరులను అరెస్టు చేశామని, వారి నుంచి ఒక ఫిస్టోల్, 16 తుటాలు, స్కార్పియో, ఇటీయాస్, బుల్లెట్, వాహనాలతో పాటు రూ. 6.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం జిల్లా ఎస్‌పి ఫక్కిరప్ప మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈనెల 20న గుంతకల్లుకు చెందిన ఆకుల వ్యాపారి వెంకటేశ్ కిడ్నాప్ కేసులో కీలక పాత్ర వహించిన సుంకర ప్రసాద్ నాయుడి కోసం వేట సాగించామన్నారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సుంకర ప్రసాద్ నాయుడుని డోన్ సమీపంలోని ఓబుళాపురంపై మిట్ట వద్ద అరెస్ట్ చేసినట్లు ఎస్‌పి వివరించారు.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లు, దొంగతనాలకు పాల్పడ్డారని వివరించారు. రెండు దశాబ్దాలకు పైగా నేర చరిత్ర ఉన్న సుంకర ప్రసాద్ నాయుడిపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు 11 కేసులు నమోదు అయ్యాయని, గత నెల 29 న స్వామీజీ ముత్యాల గంగరాజును కిడ్నాప్ చేసి రూ. 24 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేశాడని ఎస్‌పి వివరించారు. సుంకర ప్రసాద్ నాయుడితో పాటు అతని ముఠాను చాకచక్యంగా పట్టుకున్న గుంతకల్లు పోలీసులను ఎస్‌పి ప్రత్యేకంగా అభినందించారు.ఇదిలావుండగా మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ సుంకరప్రసాద్ నాయుడిపై తెలంగాణ కొన్ని కేసులలో కోర్టుకు హాజరుకాలేదని, ఎపి నుంచి అతన్ని ఇక్కడికి తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News