Sunday, December 22, 2024

మోస్ట్ వాంటెండ్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ టోనీ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ వాడకం హైదరాబాద్‌లో ఇంటి సమస్యగా మారిందని సివి ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ మాఫియాతో పాటు తొమ్మిది మందిని అరెస్ట్ చేశామన్నారు. మోస్ట్ వాంటెండ్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ టోనీ కూడా అరెస్ట్ చేశామన్నారు. ఖాకీకి చిక్కకుండా తిరుగుతున్న టోనీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన టోనీ దేశంలో ముఖ్య పట్టణాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. బెంగళూరు, చెన్నై, ముంబయిలలో డ్రగ్స్ సరఫరా కు ప్రత్యేక గ్యాంగ్‌లను ఏర్పాటు చేశామన్నారు. టోనీ ముఠా హైదరాబాద్‌లో 300 మందికిపైగా విఐపిలకు డ్రగ్స్ సరఫరా చేసింది. టోనీ తాత్కాలిక వీసాపై ముంబయి వచ్చాడని, డ్రగ్స్ తీసుకుంటే ఇకపై జైలుకే సిపి సివి ఆనంద్ హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకునేవారిని అరెస్ట్ చేయకుంటే కట్టడి చేయలేమన్నారు. సినిమా వాళ్లకు ఇక మీదట డ్రగ్స్ కేసులో మినహాయింపు ఉండదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News