Thursday, January 30, 2025

Rameshwaram cafe blast: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను కాపాడిన తల్లి ఫోన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని రామేశ్వరం కేఫ్ పేలుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పేలుడు నుంచి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తృటిలో తప్పించుకున్నారు. బిహార్‌కు చెందిన టెకీ కుమార్ అలంకృత్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం ఒంటి గంట సమయంలో లంచ్ చేస్తున్నాడు. రామేశ్వరం కేఫ్‌లో ఇండ్లీ తినడం పూర్తి చేసిన తరువాత అమ్మ నుంచి ఫోన్ కాల్ రావడంతో అలంకృత్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన మరుక్షణంలోనే బాంబు పేలుడు జరిగడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కొంచెం దూరం పరుగులు తీశాడు. కేఫ్‌లో సిలిండర్ పేలిందని అనుకున్నాడు. తరువాత బాంబు పేలుడు జరిగిందని తెలియగానే భయంతో వణికిపోయాడు. తల్లి ఫోన్‌నే తనని కాపాడిందని అతడు తెలిపాడు. ఈ బాంబు పేలుడులో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News