Wednesday, January 29, 2025

వాగులో పడి తల్లి, మూడేళ్ల కుమారుడు మృతి..

- Advertisement -
- Advertisement -

వాగులో పడి గల్లంతైన ఓ మహిళ, ఆమె కుమారుడు మృతి చెందారు. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లాలో  చోటుచేసుకుంది. పరకాల మండలంలో వెల్లంపల్లి-నర్సపల్లి గ్రామాల మధ్య నిన్న(శుక్రవారం) రమేష్ అనే వ్యక్తి, తన భార్య రాజేశ్వరి(24), కొడుకు చోటు(3)తో బైకుపై వెళ్తూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న లోతైన వాగు గుంతలో పడిపోయారు. వెంటనే నీటి గుంత నుంచి ఈదుకుంటూ రమేష్ ఒడ్డుకు చేరుకోగా.. గల్లంతైన భార్య, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రమేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్పి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News