Sunday, December 22, 2024

కరెంట్ షాక్‌తో తల్లీ,కూతురు మృతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండ చింతకుంటలో కరెంట్ షాక్‌తో తల్లీ, మృతి చెందారు. పో లీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన విద్యాధర్ బిందానికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య చింతకుంటలోని ఇటుక బట్టీలోనే ఉంటూ అక్కడే ఆమె కూతురు బాబీ బిందాని (18), కొడుకు దశరథ్ బిందానితో కలిసి ఉంటోంది. బుధవారం రాత్రి పనులకు వెళ్లి వచ్చిన బేని ఇంట్లో నిద్రించగా ఉదయమే సమీపంలో ఉండే జగన్నాథ్ అనే వ్యక్తి పనికి పోయేందుకునిద్రలేపేందుకు వచ్చాడు.

తలుపు తట్టడంతో విద్యుత్ షాక్ రాగా వెంటనే కేకలు వేసి విద్యాధర్‌కు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న విద్యాధర్ కరెంటు వైర్లు తొలగించి లోనికి వెళ్లి చూడగా బేని బిందాని, కూతురు బాబి విద్యుత్ షాక్‌తో మృతి చెంది ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు అకడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరీంనగర్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొత్తపల్లి ఎస్‌ఐ సాంబమూర్తి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News