Tuesday, March 11, 2025

బట్టలు ఉతకడానికి వెళ్లి కూతురు మృతి.. తల్లి గల్లంతు

- Advertisement -
- Advertisement -

 

అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ చెరువులో పడి లావణ్య(15) అనే యువతి మృతిచెందింది. బట్టలు ఉతకడానికి తల్లీకూతుళ్లు లావణ్య, యాదమ్మ చెరువుకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ చెరువులో పడి లావణ్య, యాదమ్మ గల్లంతయ్యారు. ప్రస్తుతం తల్లి యాదమ్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాదమ్మను వెతికే క్రమంలో మరో వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. ఇరువురి కోసం గ్రామస్థులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News