Saturday, November 16, 2024

పాతబస్తీలో తల్లీకూతుళ్లు అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: పాతబస్తీ ఫలక్‌నుమా పోలీసుస్టేషన్ పరిధిలోని ఫాతిమానగర్‌లో తల్లీకూతుళ్లు అదృశ్యమైయ్యారు. పోలీసుల కథనం ప్రకారం… ఫలక్‌నుమా ఫాతిమానగర్‌కు చెందిన షేక్ జాఫర్ ప్రైవేటు ఉద్యోగి, అతనికి భార్య అమ్రీన్ బేగం(33), ముగ్గురు కుమార్తెలున్నారు. ఈనెల 17న ఉద్యోగం నుండి ఇంటికి వచ్చిన షేక్ జాఫర్‌కు భార్య అమ్రీన్ బేగం, చిన్న కూతురు తయ్యబా ఫాతిమా(6)లు కనిపించలేదు. ఇంట్లో ఉన్న ఇద్దరు కూతుళ్లను ప్రశ్నించగా తాము ప్రార్థనలు ముగించుకొని వచ్చిన తరువాత ఇరువురు కనిపించలేదని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన అతడు భార్య, కూతురు కోసం అంతటా వెతికాడు. ప్రయోజనం లేకపోవటంతో ఈనెల 21 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Mother and Daughter missing in Old City

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News