Monday, December 23, 2024

విషవాయువుతో తల్లి, నలుగురు పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

Mother and four children have died of poison air

 

న్యూఢిల్లీ : ఢిల్లీ షహదారా పరిధి లోని సీమాపురి ప్రాంతంలో ఒక ఇంట్లో ఉంటున్న 33 ఏళ్ల మహిళ తోపాటు ఆమె నలుగురు పిల్లల ఆయువును విషవాయువు బలగొంది. స్థానికులు వీరిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మరణాలకు దారి తీసిన అనుమానాస్పద పరిస్థితులేవీ వారికి కనిపించ లేదు. చలిని తట్టుకోడానికి ఇంట్లో వెలిగించిన మంట వల్ల కమ్ముకున్న విషవాయువును పీల్చడం వల్లనే వారు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News