Sunday, December 22, 2024

హత్య కేసులో తల్లీకుమారుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 17వ తేదీన జరిగిన హత్య కేసులో తల్లీ, కుమారుడిని మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని చార్మినార్‌కు చెందిన కోట్లా అలీజాకు చెందిన షేక్ నిసార్ అహ్మద్ అలియాస్ భాషా(27) రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు, అఫ్సర్ బేగం(45) ఇద్దరు తల్లీ కుమారుడు. మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా, మేడిపల్లి మండలం, పీర్జాదిగూడ గ్రామానికి చెందిన షేక్ వాజీద్ అలియాస్ వాజిద్ మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. షేక్ నిసార్ అహ్మద్, షేక్ వాజీద్ స్నేహితులు. దీంతో వాజీద్ తరచూ నిసార్ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే అఫ్సర్‌బేగంను తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని, లేకుండా తల్లీ, కుమారుడిని చంపివేస్తానని బెదిరించాడు. దీంతో వాజీద్‌తో అఫ్సర్‌బేగం వివాహేతర సంబంధం పెట్టుకుంది.

నిసార్, అఫ్సర్‌బేగం తమ అవసరాల కోసం వాజీద్ వద్ద రూ.4లక్షలు తీసుకున్నారున. కొద్ది రోజుల తర్వాత తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇద్దరిని బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తన తల్లితో వాజీద్ పెట్టుకున్న వివాహేతర సంబంధం గురించి నిసార్‌కు తెలిసింది. ఈ నెల 17వ తేదీన వాజీద్, అఫ్సర్ బేగంకు ఫోన్ చేసి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని భూతులు తిట్టాడు. తల్లీ,కుమారుడు కలిసి ఇంటికి వస్తే డబ్బులు ఇస్తామని వాజీద్‌కు చెప్పారు. వారి మాటలు నమ్మిన బాధితుడు వెళ్లాడు. ప్లాన్ ప్రకారం అఫ్సర్‌బేగం, వాజీద్‌ను బెడ్‌రూంలోకి తీసుకుని వెళ్లాడు. అప్పటికే నిసార్ బాత్‌రూంలో దాక్కున్నాడు. వాజీద్ రాగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య చేసిన తర్వాత ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న మీర్‌చౌక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు దిలీప్ కుమార్, రవీందఱ్ , పిసిలు రాజేశ్వరి, దినేష్‌కుమార్, సంతోష్ కుమార్,అనిల్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News