Sunday, December 22, 2024

పట్టపగలే నడిరోడ్డుపై తల్లి,కొడుకు దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

నడిరోడ్డుపై పట్టపగలే కత్తితో పొడిచి తల్లి కొడుకులను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం మధ్యాహ్నం బొంతపల్లిలో కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు… సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలోని వీరభద్రనగర్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా స్థిరపడ్డ నాగరాజు వారి పక్క ఇంట్లో నివాసముంటున్న సరోజినీ దేవి (50) కుమారుడు అనిల్ (30)ను ఇరువర్గాల మధ్య గత కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. కాగా గురువారం ఇరు కుటుంబాల మధ్య మళ్లీ గొడవ జరగడంతో ఆవేశంలో హంతకుడు నా

గరాజు మోటర్ సైకిల్‌పై వెలుతున్న తల్లీకొడుకులను అడ్డుకుని తన వెంబడి తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపినట్లు తెలిపారు. అరుపులు విని చుట్టుపక్కల నివాసముంటున్న స్థానికులు రావడంతో భయపడిన హంతకుడు సమీపంలో గల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సీఐ సుధీర్ కుమార్, ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి జిన్నారం ఎస్‌ఐ నాగలక్ష్మి, ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News