Monday, January 20, 2025

కుటుంబ కలహాలతో తల్లి, కొడుకు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Mother And son commit suicide due to family quarrels

తిరుపతి: శ్రీకాళహస్తిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి కల్యాణి(26) ఆరేళ్ల కొడుకుకి విషమిచ్చి తానూ తాగింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. భర్త వేధింపుల వల్లే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News