Sunday, December 22, 2024

గంటల వ్యవధిలో తల్లి, కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

కౌడిపల్లి: ఉదయం తల్లి, అర్ధరాత్రి కొడుకు గుండెపోటుతో హఠాన్మరణం చెందిన హృదయ విదారక సంఘటన మెదక్ జిల్లా, కౌడిపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన దొంత లలిత (70)కు శనివారం గుండెపోటు రాగా హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వచ్చిన క్రమంలో అదే రోజు అర్ధరాత్రి తల్లి మృతి కలతతో తట్టుకోలేక బెంగతో కొడుకు నరేందర్ (47)కు అర్ధరాత్రి గుండె పోటు వచ్చింది. అతని భార్య లక్ష్మి ఆసుపత్రికి తరలించగా అక్కడే మరణించాడు.

ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు మరణించడంతో నర్సాపూర్ మాజీ ఎంఎల్‌ఎ మదన్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ శివ ఆంజనేయులు. ఓం ప్రకాష్, పుండరీకం గౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు గౌడి చర్ల పాండు. ఆర్‌ఎంపి డాక్టర్ సంగమేశ్వర్. శ్రీనివాస్ రావు, వెంకటేశం. నాగరాజు శ్రీనివాస్ ఉన్నారు. మృతునికి భార్య లక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఒకేరోజు గంటల వ్యవధిలో తల్లి, కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News