Wednesday, January 22, 2025

గంట వ్యవధిలోనే గుండెపోటుతో కొడుకు, తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

హవేళిఘనపూర్: కన్న కొడుకు ప్రాణం విడిచిన విషాదాన్ని తట్టుకోలేని ఓ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చి ఆస్పత్రిలోనే కుమారుడి మృతదేహం వద్ద ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలోని హవేళిఘనపూర్ మండలంలోని కూచన్‌పల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కూచన్‌పల్లి గ్రామానికి చెందిన వీరప్పగారి నర్సాగౌడ్(39) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుండెలో నొప్పి వస్తుందని నర్సాగౌడ్ చెప్పడంతో కుటుంబీకులు ఆస్పత్రికి వెళ్దామని సూచించగా నర్సాగౌడ్ చిన్న నొప్పి అంటూ తేలిగ్గా తీసుకొని పడుకున్నాడు.

కొద్దిసేపటి తరువాత పిలిస్తే పలకకపోవటంతో వెంటనే కుటుంబీకులు నర్సాగౌడ్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఆస్పత్రికి వెళ్లిన కుమారుడు ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి లక్ష్మిమెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అప్పటికే చనిపోయిన కొడుకును చూసి తల్లి లక్ష్మి ఒక్కసారిగా ఆందోళన గురై బోరున విలపిస్తూ ఆస్పత్రిలోనే కుప్పకూలింది. వెంటనే వైద్యులు పరిశీలించగా లక్ష్మీకూడా మృతి చెందినట్లు తెలిపారు. ఒకే ఇంట్లో తల్ల్లీ కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News