Wednesday, January 8, 2025

మెదక్ లో విషాదం.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

గంట వ్యవధిలో తల్లికొడుకు ఇద్దరు మృతి చెందిన విషాద సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేలిఘనపూర్ మండలం కూచన్ పల్లి గ్రామంలో నర్సింలుగౌడ్(35) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న తల్లి లక్ష్మి(55)… కొడుకు మరణాన్ని తట్టులేకపోయింది. అదే సమయంలో గుండెపోటు రావడంతో తల్లి కూడా చనిపోయింది. ఒకే రోజు తల్లికొడుకు ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News