Monday, January 20, 2025

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

Mother and Son killed in Road Accident in Nalgonda

నల్గొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున శాలిగౌరారం మండలంలోని వంగమర్తి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని ఓ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న తల్లీకొడుకు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని నాగారం మండలం నర్సింహుల గూడెంకు చెందిన వాసులు సాయమ్మ(70), అవిలయ్య(48)లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Mother and Son killed in Road Accident in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News