Thursday, January 23, 2025

గొంతులు చీలి శవాలై కనిపించిన తల్లీ ఇద్దరు పిల్లలు

- Advertisement -
- Advertisement -

కటిహార్ : బీహార్ కటిహార్ జిల్లాలో 35 ఏళ్ల మహిళ, ఆమె 6,10 ఏళ్ల వయసు పిల్లలు గొంతులు చీలి శవాలై కనిపించారని బుధవారం పోలీస్‌లు వెల్లడించారు. అయితే ఈనేరంలో భర్త ప్రమేయం ఉండవచ్చన్న అనుమానంతో మృతురాలి భర్తను బుధవారం పోలీస్‌లు అరెస్టు చేశారు. బెలౌన్ గ్రామంలో వారి ఇంటిలో మంగళవారం రాత్రి బాగా పొద్దు పోయాక ఈ సంఘటన జరిగింది. మృతులు ఫిరోజ్ ఆలం భార్య సదాబ్ జరీన్ ఖటూన్ (35). వారి ఇద్దరు పిల్లలు ఫైజాన్ ఫిరోజ్ (6). పాయా ఫిరోజ్ (10) గా గుర్తించారు. మృతురాలి తల్లి లిఖిత పూర్వక ఫిర్యాదు, ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఈ నేరంలో అనుమానాస్పద పాత్ర ఉందన్న కారణంపై ఫిరోజ్ ఆలంను పోలీస్‌లు అరెస్టు చేశారని ఎస్‌పి జితేంద్ర కుమార్ విలేఖరులకు చెప్పారు.

తన కూతును తీవ్రంగా నిందితుడు బెదిరించేవాడని, రెండో పెళ్లి చేసుకున్నాక భార్యాపిల్లలను సరిగ్గా పట్టించుకునేవాడు కాదని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నట్టు ఎస్‌పి చెప్పారు. పదునైన ఆయుధంతో తల్లి, ఇద్దరు పిల్లల గొంతులు చీల్చడమైంది. సంఘటన ప్రదేశంలో ఆయుధాన్ని పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు ఫిరోజ్ ఆలం తాను సమీప గ్రామానికి మొహర్రం ఊరేగింపుకు వెళ్లానని, తిరిగి ఇంటికొచ్చేసరికి భార్య, పిల్లలు నెత్తురు మడుగులో శవాలుగా కనిపించారని వాదించినట్టు బలియా బెలోన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ విలేఖరులకు వివరించారు. వేరే గదిలో నిద్రపోతున్న ఫెరోజ్ ఆలం రెండో భార్య ఈ సంఘటన తనకేమీ తెలియదని చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News