Monday, December 23, 2024

బతికుండగానే కన్నపేగును పాతి పెట్టిన తల్లి, నానమ్మ

- Advertisement -
- Advertisement -

పాట్నా: బతికున్న మూడేళ్ల బాలికను నానమ్మ, తల్లి పాతిపెట్టిన సంఘటన బీహార్ రాష్ట్రం సారన్ ప్రాంతంలో జరిగింది. బాలిక బిగ్గరగా ఏడ్వడంతో స్థానికులు వచ్చి ఆమెను కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మర్హ నది ఓడ్డున గల శశ్మానవాటికలో ఓ తల్లి, నానమ్మ కలిసి గుంత తీసి బాలికను పాతిపెట్టారు. శ్మశాన వాటిక నుంచి ఏడుపులు వినిపించడంతో అందరూ దెయ్యం అనుకున్నారు.  ఇద్దరు, ముగ్గురు కలిసి దగ్గరికి వెళ్లి చూడగా బాలికపై మట్టి పోసి ఉంది. దీంతో బాలికను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బాలిక వద్దకు చేరుకొని పేరు అడగగా లాలీ అని చెప్పింది. తండ్రి పేరు రాజు శర్మ, తల్లి పేరు రేఖాదేవీ అని చెప్పింది. బాలిక సొంతూరు పేరు చెప్పకపోవడంతో బాలిక కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నామని కోపా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపాడు. అమ్మ నానమ్మ తనని బయటకు వెళ్దామని చెప్పి తీసుకొచ్చారని, శ్మశాన వాటికకు తీసుకొచ్చిన తరువాత నోట్లో మట్టి పోసి పాతి పెట్టారని బాలిక తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News