హైదరాబాద్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసినగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రతీరోజూ తల్లి పిల్లవాడిని చితకబాదుతుండటంతో పక్కింటి వారు వీడియోలు తీసి సఖి సెంటర్ లో ఫిర్యాదు చేశారు. అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని పిల్లవాడిని సఖి సెంటర్ కు తరలించారు. తల్లి దాష్టీకాన్ని భరించలేక అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. రమ భర్త ఆంజనేయులు దుబాయ్ లో ఉంటున్నాడు. కుమారుడిని తల్లి పలుమార్లు తొక్కి అటు ఇటు పడేసింది. కాలుతో పలుమారులు తనయుడిని తన్నుతూ వీడియోలో కనిపించింది. దీంతో తల్లి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసి బిడ్డను పగబట్టి కొడుతున్నావ్ నువ్వు అసలు తల్లివేనా?… ఛీ జన్మ పాడుగాను అని కెవిఎం కృష్ణా అనే నెటిజన్ కామెంట్ చేశాడు. బాబు మీ అబ్బాయి కాదా?, అంతలా చావా బాదేస్తున్నావు, ఇలాంటి వాళ్ల కోసం విదేశాల్లో ప్రత్యేక శిక్షలు ఉన్నాయి, భారత దేశంలో లేవా? అని ప్రసాద్ ఎంవి అనే నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కసాయి తల్లిని నెటిజన్లు బండబూతులు తిడుతున్నారు.
జగిత్యాలలో కుమారుడిని అత్యంత క్రూరంగా హింసించిన కసాయి తల్లి
- Advertisement -
- Advertisement -
- Advertisement -