Monday, November 18, 2024

కుటుంబ కలహాలు… పిల్లలకు తల్లి విషం తాగించి… ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య…
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి…
చికిత్స పొందుతున్న చిన్నారులు..
స్థానిక పోలీసులు కేసు నమోదు, దర్యాప్తు

మన తెలంగాణ/ఎల్లారెడ్డి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడి తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జగదాంబ తండాకు చెందిన హన్సిని సోమిర్యాగడి తండాకు చెందిన గోవింద్ తో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గోవింద్ తన భార్యను పలుమార్లు వేధించిడంతో ఇద్దరు మధ్య గొడవలు జరిగాయి. సోమవారం ఎల్లారెడ్డి మార్కెటలో కూరగాయలు విక్రయించేందుకు హన్సి వచ్చింది. ఇదే సమయంలో భర్త గోవింద్ తో ఆమెకు గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన హన్సి ఇంటికి వెళ్లింది. సోమవారం ఉదయం హన్సి (35) అనే వివాహిత విషం తాగి ఇద్దరు పిల్లలు పూజ(9), నందు(6)లకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి తాగించింది.  ఇది గమనించిన గ్రామస్తులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా హన్సి మరణించగా, ఇద్దరు చిన్నారులను కామారెడ్డి ఆసుపత్రికి చికిత్స తీసుకుంటున్నారు. పిల్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా మృతురాలి తల్లి పైట్లోత్ మరోని అత్తింటి వారి పై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి పేరు పై పొలం ఉందని, ఆమె మృతి చెందితే రైతుబంధు, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని తరచూ వేధించే వారని హన్సి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్తింటి వారి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు గోవింద్, తమ్ముడు అశోక్, అన్న పీర్య తదితరులుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News