Monday, December 23, 2024

క్షణికావేశం… ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Inter Student Suicide in Tirupati

 

బెంగళూరు: క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం క్రిష్ణగిరి మత్తూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నడుపనట్టి గ్రామంలో వెంకటేషన్(39), గాయత్రి(32) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ జంటకు కనిష్కా(7), శరవణ్(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేష్ తిరుపతిలో ఉంటూ టోపీల వ్యాపారం చేస్తున్నాడు. దీంతో దంపతుల మధ్య దూరం పెరగడంతో రోజు గొడవలు జరిగేవి. శనివారం రాత్రి దంపతుల మధ్య గొడవలు జరగడంతో మనస్థాపం చెందడంతో పిల్లలకు ఉరేసి అనంతరం తాను ఉరేసికుంది. అత్తింటి వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News