Monday, December 23, 2024

బోరబండలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ నగర్ లో శుక్రవారం వివిషాద చాయాలు అలుముకున్నాయి. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లకు విషమిచ్చి ఉరి వేసుకుని జ్యోతి ప్రాణాలు తీసుకుంది. మృతులను తల్లి జ్యోతి(32), పిల్లలు అర్జున్(04), ఆదిత్య(02)గా గుర్తించారు. మృతురాలు బంజారాహిల్స్ లోని పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తోంది.

జ్యోతి భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బోరబండ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జ్యోతి ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రాణాలు తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News