Thursday, January 23, 2025

నదిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బాసర : ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా కేంద్రం గోల్ మనుమాణ్ పెద్ద బజార్ ప్రాంతానికి చెందిన మానస (27) ఇద్దరు పిల్లలు బాలదిత్య (8) భవ్యశ్రీని (5) సోమవారం మధ్యాహ్నం పాఠశాల నుండి నేరుగా బాసర గోదావరి బాసర వద్దకు తీసుకవచ్చింది. అనంతరం చివరి సారిగా తన పిల్లలకు కడుపునిండా తినిపించి పిల్లలు ఇద్దరితో కలిసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

సమాచారం అందుకున్న ముథోల్ సీఐ వినోద్ కుమార్, బాసర ఎస్‌ఐ మహేస్ సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను ఒడ్డుకు తీసుకవచ్చారు. మానస బంధు మిత్రుల సహకారంతో పూర్తి విషయాలను తెలుసుకొని కేసు దర్యాప్తు ను వేగవంతం చేస్తామని తెలిపారు. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దని కోరారు. అయితే గత మూడు సంవత్సరాల క్రితం భర్త చనిపోయిన నుండి ఆర్థిక ఇబ్బందులు తాళలేక మానస ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News