Wednesday, July 3, 2024

లీటర్‌కు రూ. 2 పెరిగిన మదర్ డెయిరీ పాల ధర

- Advertisement -
- Advertisement -

Mother Dairy have been increased by Rs 2 per litre

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సిఆర్(దేశ రాజధాని ప్రాంతం), ఇతర నగరాలలో లీటరుకు రూ. 2 చొప్పున పాల ధరను పెంచుతున్నట్లు ప్రముఖ పాల సరఫరా సంస్థ మదర్ డెయిరీ ప్రకటించింది. ఆదివారం(జులై 11) నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుందని తెలిపింది. పెట్టుబడి ఖర్చులు పెరగడంతో పాల ధరను పెంచవలసి వస్తున్నట్లు సంస్థ తెలిపింది. చివరిగా 2019 డిసెంబర్‌లో పాల ధరను మదర్ డెయిరీ పెంచగా జులై 1 నుంచి మరో ప్రముఖ పాల సరఫరా సంస్థ అమూల్ లీటరుకు రూ. 2 పెంచింది. వ్యవసాయ సంబంధిత పశుగ్రాసం, తదితర ముడిసరుకుల ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడంతోపాటు కరోనా మహమ్మారి కారణంగా పాల సేకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు కూడా పెరిగిన పరిస్థితులలో పాల అమ్మకం ధరలను పెంచడం అనివార్యంగా మారిందని మదర్ డెయిరీ తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రోజుకు 30 లక్షల లీటర్లకుపైగా పాలను మదర్ డెయిరీ విక్రయిస్తోంది.

Mother Dairy have been increased by Rs 2 per litre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News