Monday, December 23, 2024

అగ్నిప్రమాదంలో తల్లీకూతురు సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

 

Five burnt alive in fire accident at Bhoiguda

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకూతురు సజీవదహనమయ్యారు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పూరి గుడిసెకు నిప్పంటుకోవడంతో తల్లి మంగాదేవి(40), కూతురు మెడిశెట్టి జ్యోతి(23) మృతి చెందారు. జ్యోతి ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. జ్యోతి ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుడు వీరిని హత్య చేసేందుకు ఇల్లు తగలబెట్టి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అనుమానితుడు సురేష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News