Tuesday, January 21, 2025

ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

తొలి కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలం మోటువారిపల్లి లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం మోటువారిపల్లి కి చెందిన గిరిరాజుకు కురుబవాండ్లపల్లికి చెందిన వెన్నెలతో 2020 లో వివాహం జరిగింది. జూన్ 29న ఆమె అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. అస్వస్థతకు గురైన ఆమె అక్కడే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. బాలింత మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News