చండీగఢ్ : విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లిన కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడు అదే కుటుంబంలో మరో హృదయవిదారక సంఘటన జరిగింది. తాజాగా కెనడాలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గుర్‌విందర్ నాథ్ అనే విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 14 న మృతి చెందాడు. కుటుంబీకులు గుర్‌విందర్ మరణం గురించి అతడి తల్లి నరీందర్ కౌర్‌కు ముందుగా చెప్పలేదు. శుక్రవారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయానికి గుర్‌విందర్ మృతదేహాన్ని తరలించిన సంగంతి నరీందర్ కౌర్‌కు తెలిసింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురై కళ్లు తిరిగి పడిపోయింది.
వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. శనివారం ఉదయం 11 గంటలకు గుర్‌విందర్, నరీందర్‌కౌర్ అంత్యక్రియలు జరిపారు. తల్లీ, కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. పంజాబ్‌కు చెందిన గుర్‌విందర్ నాథ్ (24) ఒంటారియో ప్రావిన్స్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జులై 9 న మిస్సిసాగా ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన గుర్‌విందర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ జులై 14న మృతి చెందాడు. శుక్రవారం గురువిందర్ మృతదేహాన్ని భారత్‌కు తరలించారు.