Thursday, January 23, 2025

దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్సీ

- Advertisement -
- Advertisement -

మెదక్ రూరల్: హవేళిఘనపూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శేరి సు భాష్‌రెడ్డి హాజరయ్యారు. ఆ గ్రామ రైతుబంధు సమితి అధ్యక్షుడు రాం రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీకి స్వాగతం పలికారు. వేద పండితులు ఎమ్మెల్సీ చేత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి దర్శనం చేయించారు. తిమ్మాయిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్సీని, మండల సర్పంచ్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సర్పంచ్‌లు దేవాగౌడ్, మహిపాల్‌రెడ్డి, యామిరెడ్డి, సా యాగౌడ్, ఎంపిటిసి మాణిక్యరెడ్డి, ఉమ్మడి మండల మాజీ వైస్ ఎంపిపి గోపాలరావు, టిఎన్‌జిఓ మాజీ నేత చుక్కయ్యలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News