Sunday, December 22, 2024

కొంప ముంచిన ఆన్‌లైన్ గేమ్..

- Advertisement -
- Advertisement -

చౌటుప్పల్ ః ఫోన్లో సరదాగా ఆడిన ఆన్‌లైన్ గేమ్ చివరకు ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. ఇల్లాలు చేసిన తప్పుకు ఇద్దరు ముక్కు పచ్చలారని పసికందులు సైతం బలయ్యారు. చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని మల్లిఖార్జున నగర్‌లో నివాసముండే అవిశెట్టి రాజేశ్వరి (28), తన కుమారులైన హర్షవర్ధన్ (2), అనిరుధ్ (5) లతో కలిసి ఈ నెల 27 న సాయంత్రం నీటి సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఆత్మహత్య చేసుకున్న ముగ్గురి మృత దేహాలకు బుధవారం వారి బంధు మిత్రులు, స్థానికుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి కారణంగా విగత జీవులుగా మారిన అభం శుభం తెలియని చిన్నారులను చూసిన ప్రతి ఒక్కరూ కంటపడి పెట్టారు.

భర్తకు తెలియకుండా అప్పుచేసి ఆన్‌లైన్ గేమ్…
స్థానిక మల్లిఖార్జున నగర్‌లో నివాసముండే అవిశెట్టి మల్లేష్‌కు భార్య రాజేశ్వరి, ఇద్దరు చిన్నారులు అనిరుధ్, హర్షవర్ధన్‌లు సంతానం. వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఇదిలావుండగా మల్లేష్ డ్యూటీకి వెళ్లగా ఇంటి వద్ద వుండే భార్య రాజేశ్వరి ఆయనకు తెలియకుండా గత కొంత కాలంగా ఫోన్లో ఆన్‌లైన్ గేమ్ ఆడడం మొదలు పెట్టింది. గేమ్ కోసం ఇరుగు పొరుగు వారు, బంధువుల నుంచి సుమారు 8 లక్షల మేరకు అప్పు చేసింది. సేకరించిన డబ్బులన్నీ గేమ్‌లో పెట్టి పోగొట్టుకుంది. అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వమని ఒత్తిడి పెంచడంతో చేసిన అప్పు తీర్చలేక పరువు పోతుందని భావించి రాజేశ్వరి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఏదిఏమైనా తల్లి చేసిన తప్పుకు ఇద్దరు చిన్నారులు బలికావడం పట్ల ప్రతి ఒక్కరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News