Monday, December 23, 2024

తనయుడి కోసం పులితో పోరాడిన తల్లి….

- Advertisement -
- Advertisement -

భోపాల్: ఓ మహిళ పులితో పోరాడి తన కుమారుడిని దక్కించుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమరియా జిల్లా రోహానియా గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బాంధవగఢ్ పులు అభయారణ్య ప్రాంతంలో రోహానియా గ్రామంలో ఓ అర్చనా చౌధరి(25) తన కుమారుడితో పాటు పొలం పనులకు వెళ్లింది. 15 నెలల బాబును పొలం గట్టు మీద కూర్చోబెట్టి పొలం పనులు చేస్తుంది. పొదల నుంచి వచ్చిన పులి బాబును నోట్లో కరుచుకొని వెళ్లబోతుండగా పులితో అర్చన పోరాడింది. పులి తన పంజాతో మహిళ నడుము పెద్ద ఘాటు వేసినా కూడా భయపడకుండా క్రూర జంతువుతో 25 నిమిషాల పాటు పోరాడింది. పెద్ద ఎత్తున గ్రామస్థులు రావడంతో పులి బాబును వదిలి అడివిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమె, బాబును స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పులుల నుంచి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News