Wednesday, January 22, 2025

పిల్లలకు విషపు టీ ఇచ్చిన తల్లి

- Advertisement -
- Advertisement -

mother gave children poisoned tea: 3 children die

ముగ్గురు చిన్నారుల మృతి

ఘాజీపూర్: భర్తపై కోపంతో తన పిల్లలకు ఓ తల్లి విషపు టీ ఇవ్వడంతో ముగ్గురు చిన్నారులు మ్యత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ ప్రాంతంలో జరిగింది. సునీత యాదవ్ అనే మహిళ ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ధడ్‌హనీకు చెందిన సునీత సొంతగ్రామంలో వారంరోజుల క్రితం ఆమె మరిదితో వివాదం జరిగిందన్నారు. రెండురోజుల తర్వాత ఆమె భర్తతో ఫోన్‌లో గొడవపడిందన్నారు. ఈనేపథ్యంలో సునీత తన పిల్లలకు విషపదార్థాలు కలిపిన టీ ఇచ్చింది. టీ తాగిన హిమాన్షు యాదవ్ (10), పియూష్ యాదవ్ (8), సుప్రియ (5) ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ రోహన్ ప్రమోద్ తెలిపారు. ఆ సమయంలో ఆమె నాలుగో చిన్నారి బయట ఆడుకోవటంతో ప్రాణాలు దక్కించుకుందన్నారు. సునీత మరిది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశామని ఎస్పీ ప్రమోద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News