Saturday, December 21, 2024

కన్నతల్లినే గెంటేసిన కసాయి కొడుకు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని మౌలాలిలో ఆస్తికోసం తల్లి పట్ల కన్న కొడుకు దాష్టీకానికి పాల్పడ్డాడు. వృద్ధురాలైన కన్న తల్లిని ఇంటి నుంచి కుమారుడు గెంటేశాడు. నీరసం వస్తుందిరా గేట్లు తెరవరా అంటూ రెండు గంటల పాటు మండుటెండలో కన్నతల్లి బతిమిలాడిన కన్నకొడుకు కనికరం చూపించలేదు.  ఈ సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గేట్లు తెరిచి లోనికి రానివ్వరా ఎండలో నీరసం వస్తుందిరా అంటూ వృద్ధురాలు బతిమిలాడిన కన్న ప్రేమను కొడుకు పట్టించుకోకుండా రెచ్చిపోయి తిట్టాడు.

ఇది గమనించిన స్థానికులు గేట్లు తెరిచి అమ్మను లోనికి రానివ్వయ్యా అని చెప్పిన పట్టించుకోవడం లేదు. మౌలాలి భరత్ నగర్ నెహ్రు నగర్ లో మంగలిపల్లి సత్యవతి (68) తన కుమారుడు శ్రీకాంత్ తో కలిసి నివాసం ఉంటుంది. శ్రీకాంత్  తన తల్లిని సొంతింటి నుంచి బయటకు నెట్టి రెండు గేట్లకు తాళాలు వేసుకున్నాడు. సహాయం చేయండి అంటూ వృద్ధురాలు దారిన పోయే వారిని కాళ్లవేళ్లపడుతూ బ్రతిమిలాడడం కనిపించింది. కన్నతల్లి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న కొడుకు, కోడలు పట్ల చర్యలు చేపట్టాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. పోలీసులు ఇంటికి చేరుకొని కొడుకు, కోడలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News