మనీలా: ఫిలీఫ్పైన్స్‌లో ఓ దంపతులు ఆరు సంవత్సరాల వ్యవధిలో మూడు సంవత్సరాల కొక సారి ఒకే తేదీన ముగ్గురు పిల్లలు జన్మించారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముగ్గురు పిల్లలు సాధారణ కాన్పులోనే జన్మించారు. ముగ్గురు పిల్లలు జనవరి 27న జన్మించారు. ఫిలీఫ్పైన్స్‌లోని పాకిల్ ప్రాంతం లాగునాలో పామ్నా హెజెల్ క్యాబ్‌నెరో, హెర్భర్ట్ క్యాబ్‌నెర్ దంపతులు నివసిస్తున్నారు. పామ్నా ఓ స్కూల్ టీచర్‌గా పని చేస్తోంది.
ఈ దంపతులకు 2017 జనవరి 27న సాధారణ కాన్పులో తొలి శిశువు జన్మించింది. శిశువు పేరు మాక్లీన్ హెర్జ్ అనే పేరు పెట్టుకున్నారు. 2020 జనవరి 27న రెండో శిశువు జన్మించింది. రెండో బిడ్డ పేరు లేడీ లేమన్ అనే పేరు పెట్టారు. 2023 జనవరి 27న మూడో శిశువు జన్మించింది. ముగ్గురు మూడు సంవత్సరాల తేడాతో జనవరి 27న జన్మించారని పామ్నా తన ఫేస్‌ఖాతాలో పోస్టు చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేవుడు ఇచ్చిన దయతోనే ముగ్గురు ఒకే తేదీన జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామని పామ్నా తెలిపింది. మూడు సంవత్సరాల కొకసారి ముగ్గురు పిల్లలు ఒకే తేదీన జన్మించడం ఆశ్చర్యం కలిగిస్తుందని పిల్లల తండ్రి హెర్బర్ట్ సంతోషం వ్యక్తం చేశారు. ముగ్గురు పిల్లలు సాధారణ కాన్పులో జన్మించారని వెల్లడించారు.