Monday, April 21, 2025

దారుణం.. కూతురికి విషమిచ్చి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాచుపల్లిలోని ప్రగతి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల కుమార్తె జశ్వికకు విషమచ్చిన తల్లి కృష్ణపావని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. శనివారం తెల్లవారుఝామున చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18వ తారీఖు సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణపావని అనారోగ్యం కారణంగానే ఈ పని చేసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కూతురికి కూల్‌డ్రింక్‌లో ఎలకల మందు కలిపి తాగించిన తల్లి.. ఆ తర్వాత తాను కూడా విషం తాగింది. ఈ ఘటనలో నాలుగేళ్ల జశ్విక చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి పావని ప్రస్తుతం చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News