Thursday, January 23, 2025

కోడలిపై యాసిడ్‌తో దాడి చేసిన అత్త

- Advertisement -
- Advertisement -

చెన్నై: కోడలిపై అత్త యాసిడ్ పోసి హత్యాయత్నం చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వృద్ధాచలంలో ముఖేష్ అనే వ్యక్తి తన భార్య కృతిక, తల్లి ఆండాళ్‌తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ముఖేస్ అవినాష్ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో జాబ్ అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటాడు. కోడలి ప్రవర్తనపై అత్తకు అనుమానం కలగడంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. కోడల్ని చంపాలని అత్త నిర్ణయం తీసుకుంది. కోడలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అత్త యాసిడ్‌తో ఆమె ముఖం, ప్రైవేట్ పార్ట్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన కోడలు కేకలు వేయడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో కృతిక కంటి చూపును కోల్పోయింది. కోడలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News