Sunday, December 22, 2024

అత్త కోడలి మద్య లొల్లి..చివరికి ఏమైందంటే..?

- Advertisement -
- Advertisement -

అక్కన్నపేట: బీరువా కోసం అత్తా, కోడలు మద్య జరిగిన గోడవలో మనస్తాపానికి గురైన కోడలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ తాండ్ర వివేక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన టేకుల మనీష రమేశ్‌లకు గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరు బ్రతుకు దెరువు కోసం కొద్ది రోజులు హైదరాబాద్‌కు వెళ్లి లాక్ డౌన్ కారణంగా ఏ పని దొరకకపోవడంతో అక్కన్నపేటకు వచ్చి రమేశ్ తల్లిదండ్రులతో ఉంటున్నారన్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఇంట్లో ఉన్న బీరువా విషయయై అత్తా కోడలు గొడవ పెట్టుకున్నారని ఆ గోడవను దృష్టిలో పెట్టుకున్న మనీష మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఇంట్లోనే చీరతో ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరుడు ముత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.F

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News