Thursday, January 23, 2025

డిన్నర్‌కు పిలిచి అల్లుడితో లేచిపోయిన అత్త

- Advertisement -
- Advertisement -

జైపూర్: డిన్నర్‌కు పిలిచి అత్త అల్లుడితో  లేచిపోయిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అందారా పోలీస్ స్టేషన్ పరిధిలోని సియాకరా గ్రామంలో రమేష్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తన కూతురు కిష్నాను మమావాళి గ్రామానికి చెందిన నారాయణ జోగికి ఇచ్చి పెళ్లి చేశాడు. నారాయణ జోగి, కిష్నా దంపతులకు  ముగ్గురు పిల్లలు ఉన్నారు. నారాయణ జోగి తన అత్తతో ప్రేమలో పడ్డాడు. ఆ విషయం ఇంట్లో వారికి తెలియదు. డిసెంబర్ 30న డిన్నర్‌కు రమ్మని కూతురు, అల్లుడికి అత్త కబురు పంపింది. కూతురు తన పిల్లలు, భర్తతో అమ్మగారింటికి వచ్చింది.

మామ మందు పార్టీ ఇవ్వడంతో అల్లుడు, మామ మద్యం తాగారు. మామ మోతాదుకు మించి మద్యం తాగాడంతో నిద్రలోకి జారుపోయాడు. అందరు నిద్రపోయాక అల్లుడు అత్త కలిసి విదేశాలకు పారిపోయారు. మామ నిద్ర లేచిని తరువాత భార్య, అల్లుడు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడు, అత్త విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. భార్య చేసిన తప్పుడు పనికి మామ పరువుపోయింది. తన భర్తకు విడాకులు ఇస్తానని కూతురు తెలిపింది. అత్తకు అల్లుడుకు మధ్య వయసులో భేదం 17 సంవత్సరాలు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News