Wednesday, January 22, 2025

కోడలిని చంపి… తలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన అత్త

- Advertisement -
- Advertisement -

Mother in law killed Daughter in law

అమరావతి: కోడలిని చంపి పోలీస్ స్టేషన్ కు తలతో అత్త వచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  కొత్తపేట రామాపురం గ్రామానకి చెందిన చెందిన సుబ్బమ్మ తన కోడలు వసుంధర (35) తల నరికి తలను పట్టుకొని  పోలీస్ స్టేషన్ కు వచ్చింది. కవర్ లో ఉన్న తలను చూసి పోలీసులు నివ్వెరపోయారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ స్టేషన్ చరిత్రలో ఇటువంటి ఘటన ఇదే మొదటి సారి స్థానిక మీడియా వెల్లడించింది. వసుంధరకు భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త పేరు మీద ఉన్న ఆస్తి వసుంధరకు బదిలీ అయ్యింది. ఆ ఆస్తిని తన ప్రియుడికి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో అత్త తన చిన్న కుమారుడుతో కలిసి కోడలిని చంపి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News