Monday, December 23, 2024

మేనత్త, భర్తతో కలిసి అల్లుడిని(10) చంపి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మేనత్త తన ఇంటికి అల్లుడిని తీసుకెళ్లి భర్తతో కలిసి బాలుడిని కొట్టి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ జిల్లా కేంద్రం కడపలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆయాన్(10) తల్లిదండ్రులు శివ, భాగ్యమ్మ ఉపాధి కోసం దుబాయ్ లో ఉంటున్నారు. శివ సోదరి ఇంద్రజ అంజన్ కుమార్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో ఇంద్రజపై కోసం పెంచుకొని శివ కొన్ని రోజులు మాట్లాడటం మానేశాడు. ఇంద్రజకు కుమార్తె పుట్టిన తరువాత రెండు కుటుంబాలు కలిసి పోయాయి. మూడు సంవత్సరాల క్రితం జీవనోపాధి నిమిత్తం శివ తన భార్యతో కలిసి దుబాయ్‌కు వెళ్లాడు. కోనపేటలో ఆయాన్ మాత్రం తన నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాడు.

కోనపేటకు వచ్చిన ఇంద్రజ మేనల్లుడిని తన ఇంటికి తీసుకెళ్లింది. శివపై ఉన్న కోపంతో ఆయాన్ చిత్రహింసలకు గురిచేసింది. పలుమార్లు బాలుడిపై తన భర్తతో కలిసి తీవ్రంగా దాడి చేసింది. తొడపై కాల్చడంతో ఆయాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయాన్ అప్పటికే చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపడంతో దంపతులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని బాలుడి మృతదేహాన్సి స్వాధీనం చేసుకొని శివ తల్లికి సమాచారం ఇచ్చారు. నానమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ఆశోక్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News