Wednesday, January 22, 2025

మాతా శిశు సంరక్షణకు పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • రూ.12 కోట్ల ఆరు లక్షలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం
  • బస్తీ దవఖాన, పల్లె దవఖానాలతో ప్రజలకు చేరువైన వైద్యం
  • డయాలసిస్ సెంటర్, మోకాలు కీలు ఆపరేషన్ కేంద్రం ఏర్పాటు
  • రక్తహీనత, హిమోగ్లోబిన్ శాతం పెంచడమే న్యూట్రిషన్ కిట్ల లక్ష్యం
  • మెరుగైన సేవలు అందించిన వైద్యులకు ఘన సన్మానం
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రాంత ప్రజలు మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాలైన జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా స్థానిక ప్రభుత్వా సుపత్రిలోనే మెరుగైన సిబ్బంది తోపాటు అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించామని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్యం అందుతున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే విడితల సతీష్ కుమార్ తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం పట్టణంలోని టిటిసి భవన్‌లో ఏర్పాటుచేసిన వైద్య ఆరోగ్య దినోత్సవంలో హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

వైద్యారోగ్య దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ సౌమ్య వైద్య బృందం తోకలిసి ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు సహకారంతో హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేం ద్రం, మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. సుమారు 12 కోట్ల 6 లక్షలతో మాతా శిశు సంక్షేమ కేంద్రం, 30 పడకల సామర్థ్యం గల ప్రాథమిక ఆసుపత్రిని 50 ప డకల సామర్థ్యం గల కమ్యూనిటీ ఆసుపత్రిగా మా ర్చడం జరిగిందన్నారు.

అంతేకాకుండా 2 కోట్ల రూ పాయలతో మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో ప్రై మరీ హెల్త్ సెంటర్ నెలకొల్పడం జరిగిందని తెలిపా రు. 12 లక్షల రూపాయలతో పట్టణంలో బస్తీ ద వఖానా ఏర్పాటు చేసుకున్నామని అదేవిధంగా అదనంగా మరో 35 పల్లె దవఖానాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి లో గతంలో 54 రకాల పరీక్షలు నిర్వహించగా ప్ర స్తుతం 134 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఏఎన్‌ఎం లకు పిపి కిట్లు, పేషెంట్లకు అన్ని రకాల మందులు ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మగ శిశువు పుడితే 12 వేలు, ఆడ శిశువు పుడితే 13 వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం, ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. మాత శిశు సంరక్షణ తో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్యంకు సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పెద్దపీట వేస్తూ ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్ స్ఫూర్తితో కేసిఆర్ న్యూట్రిషన్ కిట్లకు రూపకల్పన చేసిందని తెలిపారు.

ఆరో గ్యం మహిళా కేంద్రాలు, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి లాంటి పథకాలకు శ్రీకారం చుట్టి మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. వైద్యరంగంలో మెరుగైన సేవలు అందించిన వైద్యులను, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం ప ట్టణ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ గృహప్రవేశ కార్యక్రమంకు హాజరై, కౌన్సిలర్ బొజ్జ హరీష్ నిహారిక వివాహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత ఎంపిపిలు లకావత్ మానస సుభాష్, లక్ష్మీ బిల్ నాయక్, కొక్కుల కీర్తి సురేష్, ఎఎంసి చైర్మన్ ఎడబోయిన రజని, మాజీ ఎంపిపి ఆకుల వెంకట్, మాజీ ఎఎంసి చైర్మన్ ఎడమైన తిరుపతిరెడ్డి, కాసర్ల అశోక్ బాబు, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వంగ వెంకటరామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండి అన్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి గోపాల్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి, వైద్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News