- Advertisement -
రాజబోల్లారం: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాజబొల్లారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి కుటుంబ సమస్యలతో ముగ్గురు పిల్లలతో పాటు చెరువులో దూకింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. గమనించిన స్థానికులు మరో బాబును సురక్షితంగా కాపాడారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -