Saturday, November 2, 2024

పిల్లలతో కాల్వలో దూకిన తల్లి

- Advertisement -
- Advertisement -
mother jumped into canal with her children
ముగ్గురు గల్లంతు, నీళ్లలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడిన స్థానికులు

వనపర్తి : కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒ క మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి జూరాల కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, ఈ ఘటనలో స్థానికుల ఒక బా లుడిని కాపాడారు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లాలోని పెబ్బేరు సమీపం లో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన డిసిఎం డ్రైవర్ ముదిరాజు స్వామి, భవ్య రెడ్డి ఆరు సంవత్సరాల కిందట ఆదర్శ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు. ఆదివారం భార్యాభర్తల మధ్య చిన్న వివాదం చోటు చేసుకోవడంతో భవ్య తన ముగ్గురు పిల్లలను జూరాల కాల్వ వద్దకు తీసుకువచ్చి కాల్వలోకి పిల్లలను తోసి, ఆమె కూడా దూకింది.

అటుగా వెళ్తున్న బొలెరో వాహనం డ్రైవర్ కుమార్ ఈ ఘటనను గమనించి బాలుడు సందీప్ (2) కాపాడాడు. కాల్వలో నీటి ఉధృతితో తల్లి భవ్య (31), చిన్నారులు నిహారిక (5) జ్ఞానేశ్వరి, (4 ) గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబంలో వచ్చిన తగాదాలు, కట్నం కోసం భర్త వేధింపులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా.. కాల్వలో కొట్టుకుపోతున్న చిన్నారి బాలుడిని స్థానికులు రక్షించారు. కాల్వ పొడవునా స్థానికుల సాయంతో గల్లంతైన వారి జాడ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్టు ఎస్‌ఐ రామస్వామి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News