Thursday, December 19, 2024

కన్న తల్లిని రోకలితో కొట్టి చంపిన కసాయి

- Advertisement -
- Advertisement -

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ కసాయి కొడుకు తన సొంత తల్లిని ఇంట్లో ఉన్న రోకలితో కొట్టి చంపాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా, యలాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని జక్కేపల్లి గ్రామానికి చెందిన చంద్రమ్మ తన కుమారుడు వెంకటప్పతో కలిసి ఉంటోంది. కుమారుడు వెంకటప్ప ఏ పని చేయకుండా గ్రామంలో జులాయిగా తిరుగుతుంటాడు. తల్లి దగ్గర డబ్బులు తీసుకొని మద్యం తాగుతూ ఉంటాడు. వెంకటప్ప భార్య సునీత భర్తతో వేగలేక తన తల్లి ఊరు హాజీపూర్ వెళ్లి అక్కడే ఉంటోంది.

రెండు రోజుల క్రితం మద్యం కోసం తల్లిని రోకలిబండతో చిదకబాదాడు. దీంతో గాయాలపాలైన తల్లిని వెంకటప్ప ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకపోవడంతోపాటు ఎలాంటి వైద్యం అందించలేదు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వని క్రమంలో ఆమె శుక్రవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కోడలికి సమాచారం అందించడంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News