- Advertisement -
అనంతగిరి: మద్యం మత్తులో కన్నతల్లిని కుమారుడు కడతేర్చిన సంఘటన సూ ర్యాపేట జిల్లా, అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధి, తమ్మర బండపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని సుందరయ్య నగర్‌కు చెందిన పుట్టబంతి రాములమ్మ (70) రెండేళ్ల నుంచి తన కుమారుడు పుట్ట బంతి వీరేష్‌తో కలిసి గరిడేపల్లి మండలం, సర్వారం గ్రామం నుండి వలస వచ్చి తమ్మరబండ పాలెంలో జీవనం కొనసాగిస్తోంది. వీరేష్ తాపీమేస్త్రీ పనిచేస్తున్నాడు. మద్యానికి బానిపై తల్లిని చిత్రహింసలకు గురిచేసేవాడు. తాగిన మైకంలో తాగొద్దని వాదించిన తల్లిని బుధవారం గొంతు నులిమి చంపాడు. ఈ విష యం తెలుసుకున్న ఎస్‌ఐ అనిల్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- Advertisement -