Wednesday, January 29, 2025

తల్లిని చంపిన తనయుడు

- Advertisement -
- Advertisement -

తనను ఆర్థికంగా ఆదుకోవడం లేదనే కోపంతో తల్లిని హత్య చేసిన కొడుకు సంఘటన జనగామ జిల్లా, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, నమిలిగొండలో శనివారం చోటుచేసుకుంది. సిఐ జి.వేణు మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సముద్రాల సతీష్ అనే వ్యక్తి తన తల్లి సముద్రాల లక్ష్మి (65) తనకు ఆర్థికంగా ఆదుకోవడం లేదనే కోపంతో తలపై ఇనుప రాడ్డుతో బాది హత్య చేశాడు. సముద్రాల లకి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సత్తయ్య. ఇతనికి గత మూడేళ్ళ క్రితం మడికొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

అప్పటినుండి ఏ పని చేయకుండా కాజీపేటలో ఖాళీగా తిరుగుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో లక్ష్మి ఇంట్లో నుండి అరుపులు రావడంతో ఆమె పెద్ద కుమారుడు సముద్రాల రాజు ఇంటికి తలుపు కొట్టాడు. దీంతో సతీష్ ఇనుప రాడుతో అన్నపై దాడికి ప్రయత్నించగా పక్కింటివారిని లేపి 100కి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి చూడగా తల్లి లక్ష్మి తలకు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్టు గుర్తించాడు. రాజు ఫిర్యాదు మేరకు నిందితుడు సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు సిఐ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్‌ఐ వినయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News