Sunday, January 19, 2025

ఆస్తి కోసం కుటుంబాన్ని కడతేర్చాడు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చాడు ఒక కిరాతకుడు. కన్నతల్లితోపాటు ఇద్దరు కన్నబిడ్డలను గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఉదంతం శనివారం తల్లాడ మండలం, గోపాలపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లుకి తల్లి పిచ్చమ్మతో పాటు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. జల్సాలకు అలవాటుపడిన వెంకటేశ్వర్లు రెండేళ్ల కింద ట మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్య పిట్టల దుర్గను హత్య చేశాడు. ఈ కేసులో కొంతకాలం జైలు జీవితం గడిపి ఆ తరువాత బెయిల్‌పై బైటికి వచ్చాడు. దుర్గ మరణాంతరం గోపాలపేటలోని నానమ్మ పిట్టల పిచ్చమ్మ వద్దే ఆమె మనవరాళ్ల్లు నీరజ, ఝాన్సీ ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో కన్నతల్లి నివాసం ఉంటున్న ఇంటిపై వెంకటేశ్వర్లుకు కన్నుపడింది. తన కొడుకు నేర ప్రవృత్తి గు రించి తెలిసిన పిచ్చమ్మ ఇద్దరు మనవరాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచన లో పడింది. దీంతో తన పేరిట ఉన్న ఆస్తిని తన మనమరాళ్ళ పేరు మీ ద మార్చాలని నిర్ణయించుకుంది.

ఈ మేరకు ఈ విషయాన్ని గ్రామ పె ద్దల దృష్టికి సైతం తీసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు తన తల్లి దగ్గరికి తరచూ వచ్చి ఆస్తిని పిల్లల పేరిట రాయడానికి వీల్లేదంటూ ఘర్షణ పడేవాడు. అయినా తన మనవరాళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆస్తి వ్యవహారంలో తరచూ గొడవ పడుతున్న వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి ఇంటికి వస్తానని ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో కంగారుపడిన తల్లి పిచ్చమ్మ ఇంటి చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. దీంతో వారంతా అప్రమత్తమై రాత్రి పొద్దుపోయే వరకూ వారికి కాపలాగా ఉన్నారు. అయితే వ్యూహం మార్చిన వెంకటేశ్వర్లు రాత్రివేళ ఇంటికి రాకుండా తెల్లవారుజామున ఇంటికి వెళ్లి తలపునకు గడియపెట్టి తల్లిని నిద్రలేపి ఆస్తి విషయంలో తీవ్రంగా గొడవ పడ్డాడు. ఈ సమయంలో చుట్టుపక్కల వారంతా గాఢనిద్రలో ఉన్నారు. తల్లితో వాగ్వాదానికి దిగి తీవ్ర ఆవేశానికి లోనైన వెంకటేశ్వర్లు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ గలాటాతో నిద్రలేచిన ఇద్దరు బిడ్డలు పిట్టల నీరజ (10), పిట్టల ఝాన్సీ (6) భయాందోళనకు గురై జరిగిన విషయాన్ని ఇంటి పక్కన వారికి చెప్పేందుకు ప్రయత్నించారు.

తెల్లవారుజాము కావడంతో గాఢ నిద్రలో ఉన్న వారెవరూ నిద్ర లేవలేదు. దీంతో ఆ చిన్నారులపై కూడా విరుచుకుపడ్డాడు. తొలుత చిన్న కూతురు ఝాన్సీని నేలకేసి కొట్టి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పెద్ద కుమార్తెను సైతం గొంతునులిమి అత్యంత పాశవికంగా హతమార్చి పారిపోయాడు. తెల్లవారు జామున స్థానికులు తలుపు తెరిచిచూడగా గదిలో మృతదేహాలు కన్పించాయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హంతకుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని వైరా ఏసిపి రహమెన్, సిఐ, ఎస్‌ఐ సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News